ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం

చర్లపల్లికి చెందిన హోంగార్డ్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ఎదులాబాద్ లో సర్వేనెంబర్ 258, 268 లలో ‌ హోంగార్డు మహమ్మద్ గనికి 30 గుంటల భూమి ఉంది. భూమిని కబ్జా  చేసేందుకు కొందరు హద్దురాళ్లు తొలగించారు. గని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మూడు రోజులు గడిచినా ఫిర్యాదు పట్టించుకోలేదని మహమ్మద్ గని పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీస్ అధికారులు హోంగార్డుకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు.

ALSO READ | పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్