నిమజ్జనాల ఊరేగింపుల్లో తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేసినా? అందరితో కలిసి స్టెప్పులేసినప్పుడు మస్తు మజా అన్తది. తెల్లారి అనిపిస్తది.. అబ్బా అంత జోష్ గా చేసేది లేకుండె అని,,! ఎందుకంటే.. పెయ్యంత పుండు పుండైతది. కాళ్లు చేతులు ఒకటే గుంజు. పండుకుంటే నిద్ర రాదు. కూసుంటే మన్సునపట్టది. మీరంత ఇసుంటి బాధ ఎప్పుడో ఒకసారి అనుభవించనోళ్లే కదా? మరి ఈ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాల? ఇదిగో.. ఇట్ల చేస్తే అడ్వర్టైజ్మెంట్ల చెప్పినట్లు ' మీ నొప్పులు మటు 'మాయం' అయి! మరి అవేంటో ఓసారి తెల్సుకుందమా
ALSO READ | వినాయకుడికి భక్షాల ప్రసాదాలు ఇవే..
నొప్పులు ఎక్కువగా ఉన్నయి కదా అని మెడికల్ దుకాణంలకు పోయి గోలీలు తెచ్చి ఏసుకోకుండ్రి.. ఎందుకంటే... ఇయ్యాల నొప్పులు తగ్గినా రేపు ఎన్నో సమస్యలు వస్తయట. మరి ఇటువంటి సైన్ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులు తగ్గిపోవాలంటే వేడి నీళ్లల తువ్వాలను ముంచి నొప్పి ఎక్కువ ఉన్నదగ్గర జరసేపు ఉంచాల్నట.. పసుపుతో చాయ్ చేసుకుని తాగితే కూడా మంచి రిలీఫ్ ఉంటది.
ఒక గ్లాస్ నీళ్లు తీస్కొని.. పొయ్యి మీద గరమ్ చేసుకుని, కొద్దిగా పసుపు వేసి.. సగం నిమ్మకాయ పిండి.. వేడివేడిగా ఉండంగనే తాగెయ్యాల. పసుపుల ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తయ్.