
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు హోమియోపతి వైద్య విధానానికి డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా డాక్టర్ శామ్యూల్ హనీమాన్కు మనం ఘనంగా నివాళి అర్పిస్తాం. డాక్టర్ హానీమాన్ జీవితం, ఆయన రచనలు హోమియోపతి జ్ఞానాన్ని పంచుకోవడానికి నిధిలాంటివి అని చెప్పవచ్చు. ఆయన జ్ఞానం, చేసిన కృషి కారణంగా హోమియోపతి మనందరికీ లభించిన బహుమతి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
హోమియోపతి అనేది ఒక వైద్యం చేసే కళ. హోమియోపతి ‘లెట్ లైక్స్ బి క్యూర్డ్ బై లైక్స్’ అనే ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఒక బి.హెచ్.ఎం.ఎస్ వైద్యురాలిగా, రోగుల జీవితాలపై హోమియోపతి ప్రభావాన్ని నేను చూశాను. ఈ పురాతన వ్యవస్థ కేవలం లక్షణాలకు మాత్రమే కాకుండా మొత్తం వ్యక్తి శరీరానికి చికిత్స చేస్తుంది. అలెర్జీల నుంచి ఆందోళన, నిరాశ వరకు అన్ని రుగ్మతలకు హోమియోపతి వైద్య చికిత్స అందిస్తోంది.
హోమియోపతి పరిధి విస్తారమైనది. హోమియోపతి చికిత్స అత్యున్నత ఆదర్శం.. ఆరోగ్యాన్ని వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా పునరుద్ధరించడం. హోమి యోపతి అనేది కేవలం వైద్య వ్యవస్థ మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. హోమియోపతి వైద్యం సమతుల్య జీవనశైలికి సహకరిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం, చర్మ సంరక్షణ, జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. నిద్ర సంబంధిత రుగ్మతలు, శారీరక బరువు నిర్వహణ, ఆరోగ్యాన్ని కాపాడటంలో హోమియోపతి కీలకపాత్ర పోషిస్తోంది. రోగ లక్షణాలను మాత్రమే కాకుండా కారణాన్ని బహిర్గతం చేసి, రోగంపై పోరాడటానికి ఒక సహజ మార్గం హోమోయోపతి. ఈ వైద్య ప్రక్రియలో సహనం కీలకం. ఎందుకంటే హోమియోపతి దాని మార్గంలో సహజంగా పనిచేస్తుంది. హోమియోపతి నివారణ విధానాలు సూక్ష్మమైనవి, సున్నితమైనవి, శక్తిమంతమైనవి. అయితే, హోమియోపతి వైద్యంలో సత్వర పరిష్కారం కంటే దీర్ఘకాలిక ఉపశమనానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హోమియోపతికి ప్రజాదరణ లభిస్తోంది.
- డాక్టర్.
డి. తారావర్షిణి,
హోమియోపతి వైద్యురాలు