కొత్త ప్రాజెక్ట్‌ల లాంఛ్‌లు లేవ్
నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
న్యూఢిల్లీ: ఇండియాలో టాప్ 8 నగరాల్లో కొత్తగా ఇండ్లు కొంటలేరు. దీంతో హౌసింగ్ సేల్స్ భారీగా పడిపోయాయి. కరోనా అవుట్ బ్రేక్‌తో 2020 తొలి ఆరు నెలల కాలంలో… గత పదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలకు హౌసింగ్ సేల్స్ పడిపోయాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో హౌసింగ్ సేల్స్ 54 శాతం వరకు తగ్గి 59,538 యూనిట్లకు పడిపోయాయి. కొత్తరెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాంఛ్‌లు కూడా 46 శాతం వరకు పడిపోయి 60,489 యూనిట్లుగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నయి, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాలపై ఈ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ లో ఈ క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్‌లో కూడా హౌసింగ్ సేల్స్ 84 శాతం తగ్గి 9,632 యూనిట్లుగా ఉన్నట్టు చెప్పింది. రియల్ ఎస్టేట్‌లోని అన్ని రకాల కార్యకలాపాల పైనా లాక్‌డౌన్ ప్రభావం పడిందని వివరించింది. ఈ క్యాలెండర్ ఇయర్ తొలి మూడు నెలల్లోహౌసింగ్ సేల్స్ 49,905 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ లాంఛ్‌లు కూడా గత ఏడాది రెండో క్వార్టర్‌తో పోలిస్తే.. ఈ రెండో క్వార్టర్‌లో 90 శాతం తగ్గి 5,584 యూనిట్లుగా నమోదయ్యాయి. తొలి మూడు నెలల్లోకొత్త ప్రాజెక్ట్ లాంఛ్‌లు 54,905 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల్లో ఈ క్యూ2లో హౌసింగ్ సేల్స్ పూర్తిగా నిలిచిపోయాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చేసింది.
ఎండ్ యూజర్ మార్కెట్లుగా పేరున్న బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 57 శాతం, 43 శాతం తగ్గిపోయాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో లాంఛ్ అయిన 58 శాతం యూనిట్లు కూడా రూ.50 లక్షల కంటే తక్కువ ఉన్నవేనని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చెప్పింది. గతేడాది ఇదే కాలంలో ఇవి 51 శాతంగా ఉన్నాయి. రూ.50 లక్షల కంటే తక్కువ విలువైన హోమ్ సేల్స్ కూడా 50 శాతం నుంచి 47 శాతానికి పడిపోయాయి. కరోనా సంక్షోభంతో రెసిడెన్షియన్షి ల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ బాగా ప్రభావితమైందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ, ఛైర్మన్ శిశిర్ బైజాల్ అన్నారు.
ఆదాయం ఎట్లుంటదోననే సందేహాలతోనే ఇళ్లు కొనడానికి జంకుతున్నారని, ఫలితంగా డిమాండ్ బాగా పడిపోయిందని పేర్కొన్నారు. అయితే ఆర్‌బీఐ తీసుకున్న లిక్విడిటీ చర్యలు, వడ్డీ రేట్ల కోత వంటివి రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కాస్త డిమాండ్‌ను పెంచినట్టుచెప్పారు. రెండో మారటోరియం కాలం ఈ ఆగస్ట్‌తో ముగుస్తోన్నక్రమంలో, ప్రభుత్వం కలుగజేసుకుని డెవలపర్లకోసం వన్ టైమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ తీసుకురావాలని కోరారు. అదేవిధంగా రిటైల్ లోన్లకు మారటోరియం పొడిగించాలని అన్నారు.
నెమ్మదించిన రెసిడెన్షియల్ కొత్త ప్రాజెక్ట్‌ల లాంఛ్‌లు….
ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై , కోల్‌కతాలు కొత్త ప్రాజెక్ట్ లాంఛ్‌లు బాగా దెబ్బతిన్నాయి . ఈ నగరాల్లో కొత్త ప్రాజెక్ట్ లాంఛ్‌లు, సేల్స్ రెండో క్వార్టర్‌లో జీరోగా నమోదయ్యాయి . ఎకనమిక్ స్లోడౌన్‌తో ఆదాయాలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రిపోర్ట్ చెప్పింది. అఫరబుల్డ్ సెగ్మెంట్ గృహ కొనుగోలుదారులపై కూడా ఈ కరోనా ప్రతికూల ప్రభావమే చూపిందని పేర్కొంది.
లీజింగ్ యాక్టివిటీకీ దెబ్బనే…
ఆఫీసు లీజింగ్ యాక్విటీ టి కూడా 2020 తొలి ఆరు నెలల్లో 37 శాతం తగ్గి 17.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గత పదేళ్లలో ఇదే కనిష్టస్థాయి. ట్రాన్సాక్షన్ యాక్విటీటి క్యూ2లో 79 శాతం పడిపోయింది. పుణే(–47 శాతం), హైదరాబాద్(–43 శాతం), ఎన్‌సీఆర్(–45 శాతం), బెంగళూరు(–42 శాతం) ప్రాంతాల్లో ఆఫీసు లీజింగ్‌కు డిమాండ్ పడిపోయింది.
తగ్గిన ధరలు….
ఢిల్లీ, పుణే, చెన్నైల్లో ధరలు కూడా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బాగా కరెక్షన్‌కు గురై 5.8 శాతం, 5.4 శాతం, 5.5 శాతం పడిపోయాయని రిపోర్ట్ చెప్పింది. ఐటీ మార్కెట్లుగా చెప్పుకుంటున్న హైదరాబాద్, బెంగళూరుల్లో మాత్రమే ధరలు 6.9 శాతం, 3.3 శాతం పెరిగాయి. టాప్ 8 మార్కెట్లలో అమ్ముడుపోని ఇన్వెంటరీ 1 శాతం తగ్గి 4,46,787 యూనిట్లుగా ఉన్నాయి. ముంబైలో ఎక్కువగా అమ్ముడుపోని ఇన్వెంటరీ ఉంది. ఆ తర్వాత ఎన్‌సీఆర్, బెంగళూరులలో ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ చెప్పింది. ఆఫీసు ట్రాన్సాక్షన్స్ కూడా ఈ పదేళ్ల కాలంలో అత్యంత కనిష్టస్థాయిలకు పడిపోయాయి. 37 శాతం తగ్గి 17.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నాయి. అయితే ఆఫీసు రెంటల్స్ మాత్రం యవరేజ్‌గా ఇయర్ ఆన్ ఇయర్ 4 శాతం పెరిగాయి. నెలకు ఒక్కో చదరపు అడుగులకు రూ.83గా ఆఫీసు రెంటల్స్ ఉన్నాయి. ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో మాత్రం రెంట్స్ 8.8శాతం, 12.1 శాతం తగ్గిపోయాగ్గియి. ఎక్కువ రెంటల్ గ్రోత్ నమోదయ్యే బెంగళూరులో ఈ సారి కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి . బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ సెగ్మెంట్లలో ఎక్కువ ఆఫీసు ట్రాన్సాక్షన్స్ జరుగగా.. మాన్యుఫాక్చరింగ్, కో వర్కింగ్, ఇతర సర్వీసులలో మాత్రంఈ లావాదేవీలు తగ్గిపోయాగ్గియి.