వాస్తు అద్భుతాలకు తెలంగాణ ఒక నిలయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలతో పాటు ఎందరో ఈ ప్రాంతాన్ని పాలించారన్నారు. వాళ్లందరు అప్పుడు ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారని అన్నారు సీఎం.
శతాబ్దాలుగా హైదరాబాద్ గంగా-జమునా తెహజీబ్ గా పిలువబడుతూ.. బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని తెలంగాణ రాష్ట్రం చూసిందన్నారు. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ సందర్శించారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.