హోండా యాక్టీవా చరిత్ర సృష్టించింది. గత 22 ఏళ్లలో 3 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు హోండా కంపెనీ ప్రకటించింది. దేశంలో యాక్టీవా వాహనాల విక్రయాలు జూన్ 27 నాటికి రూ. 3 కోట్లకు చేరిందని వెల్లడించింది.
2001లో హోండా కంపెనీ తొలిసారిగా యాక్టీవా బైక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 22 ఏళ్లలో యాక్టీవా అమ్మకాలు రూ. 3 కోట్లకు చేరడం విశేషం.
ALSO READ: నటసింహంతో నాలుగో సారి..
ప్రతీ ఏడాది యాక్టీవా స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. యాక్టీవా స్కూటర్ ప్రవేశపెట్టిన మూడేళ్లలోనే స్కూటీ కేటగిరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్లలో 10 లక్షల కస్టమర్లు యాక్టీవా స్కూటర్లను కొనుగోలు చేశారు. ఇక 2015లో కోటీకి పైగా యాక్టీవా స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2015 నుంచి 2023 మధ్యలో 2 కోట్ల వాహనాలను సేల్ అయ్యాయని హోండా కంపెనీ ప్రకటించింది.