Activa Electric Scooter : మార్కెట్లోకి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!

Activa Electric Scooter : మార్కెట్లోకి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇండియన్ మార్కెట్లో బాగా పాపులరైన స్కూటీ హోండా యాక్టివా. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుండటంతో తాజాగా హోండా సైతం అదే బాట పట్టింది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైందని హోండా సీఈవో అత్సుశి ఓగాటా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో హోండా యాక్టివా ఈ స్కూటర్లను మార్కుట్లో చూడొచ్చని చెప్పారు. ఇందులో ఫ్లాట్ సీటు, ఇండికేటర్ మౌంటెడ్ ఫ్రంట్ ఎప్రాన్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ ఉండొచ్చు. ఇందుకోసం హోండా కంపెనీ బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌తో భాగ్వస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 6 వేల బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా యాక్టివా ఈవీ వెర్షన్ ను అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా విక్రయించనున్నట్లు సమాచారం.. అయితే, వచ్చే ఏడాది మార్కెట్ లోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. టీవీఎస్ ఐక్యూబ్, సింపుల్ ఎనర్జీ వన్, ఏథర్ 450 ఎక్స్, బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ 1 తదితర మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. ఈ స్కూటర్ ధర, బ్యాటరీ వివరాలు, స్పీడ్ రేంజ్ గురించి కంపెనీ ఇంకా ప్రకటించలేదు.