హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త ఎస్పీ160 బైకును లాంచ్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్, పెర్ఫార్మెన్స్ మరింత బాగుంటాయని కంపెనీ తెలిపింది. ధర రూ.1.22 లక్షల నుంచి మొదలవుతుంది.
కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మాస్కులర్ ఫ్యూయల్ట్యాంక్, ఎల్ఈడీ టెయిల ల్యాంప్, 4.2 ఇంచుల స్క్రీన్, బ్లూటూత్కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఇందులోని 162 సీసీ ఇంజన్9.7 కిలోవాట్ల పవర్‌ను ఇస్తుంది.