టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఏ రంగమైన అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునే వస్తువల తయారీకి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇదే తరహాలో హోండా కంపెనీ కూడా కొత్త ఆవిష్కరణ చేసింది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీని వినియోగించి హోండా కంపెనీ సూట్ కేస్ సైజ్ ఫోల్డబుల్ ఎలక్ర్టిక్ స్కూటర్ ను తయారు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కి కూడా విడుదల చేసింది. దీని ధర ఎంతో తెలుసా.. 855 డాలర్లు అంటే సుమారు రూ.72 వేలు. దీనిని 2023 నవంబర్ లో హోండా అన్ని అధీకృత డీలర్ల ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తారు.
హోండా మోటో కాంపాక్ట్ మినీ ఈ స్కూటర్ సైజు, మెకానిక్స్ గురించి..
హోండా మోటో కాంపాక్ట్ మినీ ఈ స్కూటర్ సైజు కేవలం 19 కిలోలు మాత్రమే.. దీని పరిమాణం 38 అంగుళాలు(965 మి.మీ.). మడత పెట్టినప్పుడు 28 అంగుళాలకు తగ్గుతుంది.
పరిమాణంలో చిన్నదే అయినా దీని బ్యాటరీ 6.8 Ah పవర్ ను చూపుతుంది. గరిష్టంగా 16Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా మోటె కాంపాక్టో ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ తక్కువల తక్కువ 19 కి.మీలు.. గరిష్టంగా 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
ఇక కంఫర్టబులిటీ గురించి ఆలోచిస్తే.. కొత్తగా వస్తున్న హోండా మోటో కాంపాక్టో మిని ఈ స్కూటర్.. జీరో కార్బన్ ఎమిషన్ బైక్ కాబట్టి నగరాలు, కాలేజీ క్యాంపస్ లకు ఇది సరియైన ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ చెబుతోంది. మెత్తని సీటు, మంచి స్తిరత్వం, గ్రిప్ ఫుట్ పెగ్ లు, ఆన్ బోర్డ్ స్టోరేజీ, ఛార్జ్ గేజ్, డిజిటల్ స్పీడోమీటర్లతో కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడింగ్ ను అందిస్తుంది.