Honda Shine 100: షైన్ 100ని హోండా మోటార్స్ ఇండియా భారత మార్కెట్లో అందిస్తోంది. కంపెనీకి చెందిన ఈ బైక్ దేశంలో ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది కాలంలో మూడు లక్షల మంది కస్టమర్లు దీన్ని కొనుగోలు చేశారు. 100 సీసీ సెగ్మెంట్ గల ఈ బైక్‌లో కంపెనీ ఎలాంటి ఫీచర్లను అందించింది? ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు?. అంతకస్టమర్లు షైన్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు? తదితర వివరాలను తెలుసుకుందాం.
హోండా షైన్ 100 సీసీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఇండియా ప్రెసిడెంట్, CEO సుట్సుము సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. మా కస్టమర్‌ల నుండి అద్భుతమైన స్పందనతో హోండా షైన్100 తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసిందని, సరసమైన, విశ్వసనీయతను అందిస్తూ మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మోటార్‌సైకిల్ మా కస్టమర్‌లకు అసాధారణమైన విలువను, మనశ్శాంతి యాజమాన్య అనుభవాన్ని అందించడానికి హోండా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. తమ అంచనాలను మించిన ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారిస్తామన్నారు. భారతీయ మార్కెట్లో తమ కంపెనీ ఉనికిని బలోపేతం చేస్తామని అన్నారు.
Features : హోండా షైన్ 100, ESP టెక్నాలజీ, PGM-FI టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఇది ఈక్వలైజర్‌తో కూడిన CBS, పొడవైన, సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, బలమైన గ్రాబ్ రైల్ వంటి కొన్ని ఫీచర్లతో వస్తుంది.
Engine : హోండా షైన్‌కు కంపెనీ 98.98 cc SI ఇంజన్‌ను అందిస్తుంది. దీని కారణంగా ఇది 5.43 కిలోవాట్ల శక్తిని, 8.05 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఇందులో తొమ్మిది లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. సెల్ఫ్/కిక్ స్టార్ట్ కూడా అందించబడుతుంది. దీని రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి.
Price : గత ఏడాది కాలంలో భారత మార్కెట్‌లో మూడు లక్షల మంది కస్టమర్లు ఈ బైక్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ బైక్‌ను ఢిల్లీలో రూ.64,900, హైదరాబాద్ లో రూ 81,340 ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.