![డ్యాన్స్ ద్వారా మాట్లాడుకుంటయ్](https://static.v6velugu.com/uploads/2020/02/Honey-Bee.jpg)
తేనెటీగలు డ్యాన్స్ మూవ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయని అమెరికాలోని మిన్నెసోట యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. తేనెటీగల 1500 రకాల డ్యాన్స్ మూవ్స్‌తో వారు డిక్షనరీని క్రియేట్ చేశారు. ఈ మధ్య కాలంలో తేనెటీగల సంఖ్య తగ్గుతోందని, అవి ఉండేందుకు సహజసిద్ధమైన నివాసాలను ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంపైనా స్టడీ చేశారు. మిన్నెసోట యూనివర్సిటీ సైంటిస్ట్ మోర్గాన్ కార్ మార్కెల్ ఆధ్వర్యంలోని టీమ్ తేనెటీగల కోసం వేర్వేరు చోట్ల రెండు కాలనీలను నిర్మించి వాటిపై స్టడీ మొదలుపెట్టారు. తేనెటీగలు ఎగిరేటప్పుడు ఒక ఫార్మేషన్ లా ఏర్పడి ‘వాగల్’ డ్యాన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయని, దీంట్లో 1500 రకాల డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయని గుర్తించారు. తేనెతుట్టెకు దూరమున్నప్పుడే వాగల్ డ్యాన్స్ ను తేనెటీగలు వాడటం విశేషం. ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎంత దూరంలో ఉందనే అంశాలను అవి స్పష్టంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి.