
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. కె కె ఆర్, బాల రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. స్ఫూర్తి జితేందర్ ఈ సాంగ్ కంపోజ్ చేయడంతో తనే పాడింది.
అలాగే కిట్టు విస్సా ప్రగడతో కలిసి లిరిక్స్ కూడా రాసింది. ‘యూ సే పొరాటో.. నేనంటా పొటాటో .. మన జంటే అయ్యిందేమో ఒక పొరపాటో.. ’ అంటూ సాగిన పాట ఆకట్టుకుంది. కీలక పాత్రలు పోషించిన తనికెళ్ల భరణి, సుహాసిని పెళ్లి దుస్తుల్లో డిఫరెంట్ లుక్స్‌లో ఈ పాటలో కనిపించారు. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తునట్టు మేకర్స్ చెప్పారు.