క్రిస్మస్ వేడుకల తర్వాత.. ప్రముఖ నటి ఆత్మహత్య

ప్రముఖ హాంకాంగ్ నటి లై సుక్ యిన్ డిసెంబరు 26న ఆత్మహత్య  చేసుకుంది. ఆమె వయసు ప్రస్తుతం 47. పలు మీడియా నివేదికల ప్రకారం, సుక్ యిన్ మంగళవారం మధ్యాహ్నం ఆమె కొడుకుతో పాటు అపస్మారక స్థితిలో కనిపించింది. హాంకాంగ్‌లోని మోంగ్ కోక్‌లోని తన ఇంటిలో ఆమె బొగ్గుతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన అనంతరం లై సుక్ యిన్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడలేదు. ప్రస్తుతం ఆమె ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అంతకుముందు రోజు లై సుక్ యిన్ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది. అప్పటిదాకా ఆనందంతో ఉన్న ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.

1998లో లై సుక్ యిన్ హాంకాంగ్ నటుడు లోవ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఈ జంట 2006లో విడాకులు తీసుకున్నారు. అనంతరం, ఆమె 2007లో కాస్మెటిక్ సర్జన్ అంగస్ హుయ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు అయ్యారు.