మాటిల్డా.. హాలివుడ్ మూవీ.. ఇది 1996 లో వచ్చిన సినిమా.. ఇందులో మారావిల్సన్ తన కళ్లతో అన్ని వస్తువులను లిఫ్ట్ చేస్తుంది.. కళ్లతో నే అంతా మ్యాజిక్ చేస్తూ అందరిని ఆశ్చ ర్యపరుస్తుంది. నిజంగా కళ్లతో అలా చేయొచ్చా.. అయితే ఇప్పుడు మనం కూడా మన కంటి చూపుతో ఏదైనా కదిలించొచ్చు. ఎలా అంటున్నారా.. Honer Magic 6 Pro స్మార్ట్ ఫోన్ తో.. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. సాధ్యమే.. ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో కారును డ్రైవ్ చేయొచ్చు. Honer Magic 6 Pro స్మార్ట్ ఫోన్ ఫీచర్లు,ధర , ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.
అద్భుతమైన AI ఫీచర్ తో Honor కంపెనీ Magic 6 Pro స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. స్పెయిన్ లోని బార్సిలోనా లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను విడుదల చేసింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ఫీచర్లను రివీల్ చేసింది. రిమోట్ కంట్రోల్ తో కూడిన యాప్ ద్వారా కారును నడపడం వంటి పనుల చేయడానికి ఫోన్ లో ఉన్న కంటి ట్రాకింగ్ పవర్ ను ఎలా ఉపయోగించాలో డెమో ఇచ్చింది.
చైనీస్ టెక్ దిగ్గజం హానర్ తన తాజా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో ను కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో , Qualcomm స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ , Android 14 ఆధారిత హానర్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఐ ట్రాకింగ్ AI ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ కస్టమర్లు తమ ఫోన్ స్క్రీన్ ని చూడటం ద్వారా వారి లాక్ చేయబడిన వారిక కారును రిమోట్ గా అన్ లాక్ చేస్తుంది. Honor Magic 6Pro దాని 12GB, 512 GB స్టోరేజీ వేరియంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్లు ఫిబ్రవరి 25 నుంచే ప్రారంభమయ్యాయి. మార్చి 1 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Honor Magic 6Pro Snoapdragon 8 Gen3 చిప్ సెట్ తో వస్తుంది. Android 14 ఆధారిత Magic OS 8 పనిచేస్తుంది. ఈ డివైజ్ 16 GB RAM , 1TB స్టోరేజ్ ఆన్ బోర్డ్ ను అందిస్తోంది. ఇది 6.8 అంగుళాల 120Hz 1280p LTPO AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 80 W ఛార్జింగ్ తో 5600 mAh భారీ బ్యాటరీ పక్యాక్ ను కలిగి ఉటుంది. వాటర్ ప్రూఫ్, డస్ట్ ఫ్రూప్ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంటుంది.
ALSO READ :-వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూ... మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు
కెమెరా విషయానికి వస్తే.. హానర్ మ్యాజిక్ 6 ఫ్రో లేటెస్ట్ కెమెరా సెటప్ నుకలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ స్టిబిలైజేషన్ (OIS) తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, OIS sy pcrl 180 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా 2.5 x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉంది. TOF 3D సెన్సార్ తో 50MP సెల్పీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ ఫోన్ ధర రూ. 1,16,600.