
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?..తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గల హ్యాండ్ సెట్ కోసం ఎదురు చూస్తున్నారా.. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండే స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్.ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సంస్థ హానర్ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది చూడడానికి iPhone లా ఉంటుంది. బ్యాటరీ పరంగా దానిని మించి పర్మార్మెన్స్ అందిస్తోంది. Honor స్మార్ట్ ఫోన్ 8000mAh లో అద్బుతమైన బ్యాటరీ బ్యాకప్ అందిస్తోంది.
బిగ్ బ్యాటరీతో 'Honor Power'
హానర్ కొత్తగా లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను Honor Power పేరుతో మార్కెట్లోకి వదిలింది. Power సిరీస్‌లో ఇది మొదటి ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ 28.93Wh కెపాసిటీ గల 8000mAh బ్యాటరీ ఉంది. ఏర్పాటు చేశారు.ఈ హ్యాండ్ సెట్ లో iPad Air లో ఉన్న 29.6Wh బ్యాటరీకంటే పెద్దది. 821Wh/L ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఇందులో సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీను వినియోగించారు.
కెమెరా సెటప్,డిజైన్..కెమెరా విషయానికొస్తే ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ లో 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో), 5MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. కెమెరా సెటప్ సాధారణంగా ఉన్నా పనితీరు చాలాబాగుంటుంది.
Also Read : మెుబైల్ యూజర్లకు షాక్
మెమోరీ.. ఈస్మార్ట్ ఫోన్‌లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గరిష్టంగా 512GB వరకు స్టోరేజ్, 12GB వరకు RAM వేరియంట్లు ఉన్నాయి. డిజైన్ పరంగా చూస్తే లేటెస్ట్ iPhone లాగా ఉండే లుక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.Honor Power హ్యాండ్ సెట్ Snow White, Phantom Night Black, Desert Gold రంగుల్లో లభ్యమవుతోంది.
ధర, లభ్యత..
Honor Power స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయింది. వేరియంట్ల వారీగా ధరలు..
8GB + 256GB వేరియంట్: రూ.18వేలలోపే
12GB + 256GB వేరియంట్: రూ.27వేలు
12GB + 512GB వేరియంట్: రూ.21వేలు