జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బనుక శివరాజ్ యాదవ్ ను ఆయన చాంబర్లో మంగళవారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, స్టేట్స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సన్మానించారు. శివసేన రెడ్డి మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లో పని చేసిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందనడానికి శివరాజ్ నియామకమే నిదర్శనమన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే యువజన కాంగ్రెస్ నాయకులను గుర్తించి టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సేవలందించాలని శివరాజ్‌కు సూచించారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, లింగాల నర్సిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు బొట్ల నర్సింగరావు, శీలం కొండల్, బన్సీలాల్, నామాల శ్రీను, కౌన్సిలర్ గాదెపాక రామచంద్రం, యూత్ కాంగ్రెస్ రాష్ర్ట నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దాసరి క్రాంతి, మిద్దెపాక స్టాలిన్, మచ్చ ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.