8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..

8ఏళ్ళ బాలుడికి గుండెపోటు..  భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా 6ఏళ్ళ పిల్లల నుండి 60ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరికి ఎప్పడు గుండెపోటు వస్తుందో చెప్పలేని విధంగా తయారయ్యింది పరిస్థితి.. వయసు పైబడ్డవారికే గుండెపోటు వస్తుందనేది పాతకాలం మాట.. యాక్టివ్ గా ఉన్నోళ్లకు కూడా నెక్స్ట్ సెకన్లో గుండెపోటు వచ్చి మరణించిన దాఖలాలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.. 8 ఏళ్ళ బాలుడు గుండెపోటుతో మరణించిన సంఘటన మనసును కలిచివేస్తోంది. సోమవారం ( జనవరి 20, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్ ఈటా నగర్ లో 8 ఏళ్ళ బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఆడుకుంటున్న సమయంలో 6 ఏళ్ళ బాలిక అతన్ని ఆట పట్టించాలని పెద్దగా శబ్దం చేయటంతో బాలుడు కుప్పకూలినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. 8 ఏళ్ళ పసిప్రాయంలో బాలుడు మృతి చెందడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ALSO READ | రేణిగుంట - కడప హైవేపై ఘోర ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తున్న ముగ్గురు మృతి..

పెద్ద పెద్ద శబ్దాల వల్ల చిన్నపిల్లల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని.. ఆదుకునే సమయంలో పిల్లలను ఓ కంట పెట్టాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉన్నట్టుండి వచ్చే పెద్ద శబ్దాల వల్ల చిన్నపిల్లల్లో కార్డియాక్ రిథమ్ దెబ్బతిని గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.