పార్లర్ ముసుగులో హుక్కా సెంటర్.. పోలీసుల దాడులు

రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పలు డైరీ ఫామ్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డైరీ ఫామ్ దగ్గర  పార్లర్ ముసుగులో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ ప్లాట్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ దాడుల్లో హుక్కా సేవిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. హుక్కా  డబ్బాలు,10 హుక్కా ప్లేవర్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 మందిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.