కల్కి సినిమా..కాశీ, కాంప్లెక్స్, శంభాల అనే మూడు వేరు వేరు ప్రపంచాలతో తెరకెక్కి అద్భుతమైన విజయం సాధించింది. 3000 ఏళ్ళ తర్వాత కాశీ నగరం ఎలా ఉటుంది? అక్కడ మనుషులు, వారి జీవన విధానం ఎలా ఉంటుందనే దానిపై చాలా రీసర్చ్ చేసి నాగ్ అశ్విన్ ఒక కళాకండాన్ని ప్రేక్షకుల ముందుంచారు.ఆ సమయంలో అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు. అలాగే కాశీలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో కాంప్లెక్స్ అనే మరో ప్రపంచం ఉంటుంది.కాశీలో లేని అన్ని కాంప్లెక్స్ లో ఉంటాయి. ఒకరకంగా అది త్రిశంకు స్వర్గం అని చెప్పొచ్చు.
ఇక శంభాల అనేది మరోక ప్రపంచం ఉంటుంది. అక్కడి మనుషులకు దేవుడి రాక అక్కడి నుండే అనే నమ్మకం ఉంటుంది. వారి అలవాట్లు, జీవనవిధానం కూడా వేరే రకంగా ఉంటుందనే విషయాన్నీ చూపించారు. ఇక చివరికి హోప్ ఆఫ్ శంభాల అనే ఇంటెన్స్ ని చూపించి శభాష్ అనిపించుకున్నాడు.
తాజాగా కల్కి సినిమా నుంచి హోప్ ఆఫ్ శంభాల అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ గీతానికి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించగా..శోభన చంద్రకుమార్ ఆలపించారు.
‘కలి’ ఆగడాల నుంచి ‘కల్కి’ అవతారం చాలించేవరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబళ నగరం కేంద్రంగానే చోటుచేసుకున్నాయి.ఇంతకీ శంబళ అంటే ఏమిటీ? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు, ఈ నగరానికి సంబంధం ఏమిటీ? అనేది సినిమా చూసి తీసుకోవొచ్చు. ఇంకాస్త డెప్త్ గా తెలియాలంటే కల్కి 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి హోప్ ఫర్ శంభాల అనే వీడియో సాంగ్ ని విని ఎంజాయ్ చేయండి.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టి రూ.1000 కోట్ల మార్క్‌కు దగ్గరగా వెళుతుంది. ఇంకా చూడని వారుంటే..ఈ అద్భుత కళాకండాన్ని చూసి మైథాలజీ హిస్టరీ తెలుసుకోండి.