పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్, ఫాస్ట్ బౌలర్ ఒషేన్ థామస్ వెస్టిండీస్ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇండియాతో గురువారం నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం మంగళవారం ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. రోవ్‌మన్ పావెల్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన ప్రాథమిక జట్టులో నుంచి 13 మంది ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. ఇండియాతో వన్డే సిరీస్‌లో విండీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షై హోప్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్‌లో పోటీ పడ్డాడు. 26 ఏండ్ల థామస్ 2021 డిసెంబర్లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గురువారం ట్రినిడాడ్‌లో, 6,8వ తేదీల్లో రెండో, మూడో మ్యాచ్‌లు గయానాలో జరుగుతాయి. ఆఖరి రెండు మ్యాచ్‌లు ఈ నెల 12, 13వ తేదీల్లో ఫ్లోరియాలోని లాడర్‌హిల్‌లో షెడ్యూల్ చేశారు.
విండీస్ టీ20 టీమ్:
పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, హెట్మయర్, హోల్డర్, షై హోప్, అకీల్ హోస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, మెకాయ్, పూరన్, షెపర్డ్, ఓడియన్ స్మిత్, ఒషేన్ థామస్.