![ఈ వారమే పార్లమెంటుకు కొత్త ఐటీ బిల్లు: మంత్రి నిర్మల](https://static.v6velugu.com/uploads/2025/02/hope-to-introduce-new-income-tax-bill-in-lok-sabha-next-week-nirmala-sitharaman_LyszAKu2wN.jpg)
న్యూఢిల్లీ: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) చట్టాన్ని ఈ వారంలో లోక్‌సభలో ప్రవేశ పెడతామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రవేశ పెట్టాక ఈ కొత్త చట్టం పరిశీలనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెళుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని యూనియన్ కేబినెట్ శుక్రవారం కొత్త ఐటీ చట్టాన్ని ఆమోదించింది. కొత్త ఐటీ బిల్లు పార్లమెంటరీ కమిటీకి వెళ్లిన తర్వాత మళ్లీ కేబినెట్ అనుమతుల కోసం వస్తుంది. కేబినెట్ ఆమోదించాక మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు.
కొత్త ఐటీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంలో మూడు స్టేజ్‌లు దాటాల్సి ఉందని సీతారామన్ అన్నారు. బడ్జెట్ తర్వాత ఆర్‌బీఐ బోర్డు డైరెక్టర్లతో ఆమె సమావేశమయ్యారు. మీడియాతో చర్చించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం–1961 ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని కిందటేడాది జులై బడ్జెట్‌లో సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం ఇంటర్నల్ కమిటీని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసింది.