దేశం గర్వపడేలా చేయాలని ఆశిస్తున్నానని ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ సినీ శెట్టి అన్నారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని తెలిపారు. తన కోసం చేసే ప్రార్థనలన్నీ నిజం అవుతాయని ఆశిస్తున్నట్టు సినీ చెప్పారు. దాంతో పాటు ఈ దేశం గర్వపడేలా చేస్తానని చెప్పారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా డిజైనర్ షో సీజన్ 4కు మిస్ ఇండియా సినీ శెట్టి హాజరయ్యారు. లైట్ పింక్ డ్రెస్ ధరించిన ఆమె.. ర్యాంప్ పై నడుస్తూ అందర్నీ ఆకర్షించారు. కర్ణాటకకు చెందిన ఈ 21ఏళ్ల అందాల భామ ముంబైలో జన్మించారు. అకౌంటింగ్, ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన సినీ.. భరతనాట్య నర్తకి కూడా కావడం విశేషం.