హార్లిక్స్ ఇప్పుడు హెల్త్డ్రింక్ కాదు..ఇది కేవలం ఫంక్షన్ న్యూట్రిషనల్ డ్రింక్ మాత్రమే..అని ‘హెల్తీ డ్రింక్’ కేటగిరి నుంచి హార్లిక్స్ను తొలగించి ఫంక్షనల్ న్యూటిషనల్ డ్రింక్ గా రీబ్రాండ్ చేశారు. ఇటీవల ఈ డ్రింక్ పై విధించిన నిషేధం తర్వాత ప్రతిచర్యగా హార్లిక్స్ను హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ రీబ్రాండ్ చేసింది.
కొద్దిరోజుల క్రితం హార్లిక్స్ డ్రింక్ ను నిషేధించిన విషయం తెలిసిందే. మోతాదు మించి చక్కెర ఉందని..హెల్తీ డ్రింక్స్ కేటగిరి నుంచి హార్లిక్స్ తొలగించారు. ఈ చర్య తర్వాత హార్లి్క్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ డ్రింక్ను రీబ్రాండ్ చేసింది. క్యాడ్ బరీ బోర్నవిటా , హార్లిక్స, బూస్ట్ వంటి పానియాలను హెల్త్ డ్రింక్ కేటగిరిలో ఉంచొద్దని కేంద్రం సూచించింది. ఇటువంటి పానీయాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో చేర్చలేదని వెంటనే వీటిని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తొలగించాలని ఈ కామర్స్ సంస్థలకు ఆదేశించింది.
డైరీ, తృణధాన్యాలు, మాల్ట్ ఆధారిత పానీయాలను హెల్త్ డ్రింక్స్ గా లేదా ఎనర్జీ డ్రింక్స్ గా లేబుల్ చేయవవద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ కామర్స్ వెబ్ సైట్ లను కోరింది. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించడమే అని హెచ్చరించింది.