విశ్వావసు సంవత్సరంలో తులారాశి వారి జాతకం.. ఆదాయం, వ్యయం ఎలా ఉన్నాయంటే..?

విశ్వావసు సంవత్సరంలో తులారాశి వారి జాతకం.. ఆదాయం, వ్యయం ఎలా ఉన్నాయంటే..?
  • ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో
  • ఆదాయం : 11 
  • రాజపూజ్యం : 2
  • వ్యయం : 5
  • అవమానం : 2

గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు లోహమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు రజితమూర్తిగా 05.12.2025 వరకు సువర్ణమూర్తిగాను ఉగాది వరకు సంచారము. 
శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారము. 
రాహు: ఉగాది నుండి లోహమూర్తిగా సంచారము. కేతువు: ఉగాది నుండి మరల ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము. 

ఈ రాశి స్త్రీ పురుషులకు ఆదాయ వ్యయములందు అనుకూలత రైతు సోదరులకు అనుకూలం. రైతు సోదరులకు అనుకూలం. వృత్తి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.  లాయర్లు డాక్టర్లు కొంత శ్రమ అధికంగా ఉన్నది. కాంట్రాక్టర్లు టెండర్లు చాలా జాగ్రత్తగా వేయవలెను. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడగలరు. ఇందులో గ్రహ కలయిక అంతంత మాత్రంగా ఉన్నది. వెండి, బంగారం వ్యాపారులకు అనుకూలం. ఇనుము, సిమెంట్​ కంకర వారికి సామాన్య లాభము. టింబర్​ వారికి సామాన్య లాభము. 

►ALSO READ | విశ్వావసు నామ సంవత్సర మకరరాశి వారి జాతకం.. ఆదాయం, అవమానం, ఖర్చులు ఎలా ఉన్నాయంటే..?

బిగ్​ ఇండస్ట్రీ వారికి చాలా జాగ్రత్త ఉండవలసిన రోజులు. స్మాల్​ ఇండస్ట్రీ వారికి సామాన్య లాభములు. చిట్స్​ షేర్స్​ కొంత ఇబ్బంది కరంగా ఉండగలదు. మత్స్య పరిశ్రమ కొన్ని రోజులు లాభాలు, కొన్ని రోజులు బ్యాలన్స్​గా ఉంటుంది. కోళ్ల పరిశ్రమ కొన్ని ఇబ్బందులు ఉన్నవి. పాడి పరిశ్రమ సామాన్యంగా ఉంటుంది. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు సామాన్యంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఆర్భాటంగా ఉంటారు. శత్రుశేషం బలంగా ఉన్నది. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. 

కొన్ని విధములుగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీరు అనుకొన్న పనులు అతి కష్టం మీద అవుటకు అవకాశం ఉన్నది. పట్టు విడవకుండ ఉంటేనే సాధ్యపడుతుంది. స్నేహితుల సహకారంతో వివాహ ప్రయత్నములు ఫలించగలవు. పంతాలు, పట్టింపులకు చాలా దూరంగా ఉండండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎక్కడో ఒకచోటులో ఇరుక్కొనగలరు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఈ సంవత్సరంలో అనుకూలతగానే కనిపిస్తుంది కాని అర్థం కాదు. సంవత్సరం లాస్ట్​లో కొంత ఉపశమనంగా ఉంటుంది. 

ఆకస్మిక ధనలాభమున్నది చేజార్చుకొనరాదు. విద్యార్థులకు అధిక మార్కులు. విదేశియానం కొంతవరకు అవకాశమున్నది. తక్కువగా మాట్లాడగలరు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. మీరు చేయు రంగంలో మంచి సమయంలో పనులు ప్రారంభించిన పూర్తి చేసుకొనగలరు. ఎవరికి ఏ పరిస్థితులలో హామీ ఉండరాదు. సేవా కార్యక్రమాలు ఇష్టదైవ పూజలు సంతృప్తిని ఇవ్వగలవు. స్థానచలనం ప్రయాణంలో ప్రమాదములు శకునం చూసి బయలుదేరండి. చిత్త నక్షత్రం వారు పగడం ధరించండి. 

►ALSO READ | కన్యారాశి వారికి డబ్బులే డబ్బులు.. విశ్వావసు నామ సంవత్సరంలో భారీగా ఆదాయం

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, శరవణభవ అనే నామం జపం చేయండి. స్వాతి నక్షత్రం వారు గోమేధికం ధరించండి. దుర్గాదేవికి పూజలు అష్టోత్తర సహస్ర నామాలు శుక్రవారం సాయంత్రం అమ్మవారికి చీర జాకెట్​ ముక్క 2 దండ నిమ్మకాయల దండ పానకము వడపప్పు చలిమిడి కొబ్బరికాయలు 5 కుంకుమతో అష్టోత్తర సహస్ర నామములు చేయించండి. విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించండి. 

దక్షిణామూర్తికి గురువారం శనగల గుగ్గిళ్లు కొబ్బరి ముక్కలు మీ చేతితో ప్రసాదములు పంచండి. అలాగే షిరిడి సాయి బాబా వారికి ఈ విధంగా శనగళ్ల గుగ్గుళ్లు ప్రసాదములు పంచండి. మహన్యాస రుద్రాభిషేకం జలాభిషేకం చేయించుకొనగలిగితే మానసిక ఒత్తిడి తగ్గును. ఎవరికి ఏ విధమైన సలహాలు ఇవ్వరాదు. శత్రువులను ప్రసన్నం చేసుకొనుటకు యోగ, ధ్యానం, నవగ్రహ ప్రదక్షిణలు సంతృప్తిని ఇవ్వగలవు. ఇష్టదైవారాధన అఖండ దీపారాధన చేయండి. అదృష్టసంఖ్య 6.