
- విశాఖ 4వ పాదము; అనురాధ 1, 2, 3, 4 పాదములు; జేష్ఠ 1, 2, 3, 4 పాదములు,మీ పేరులో మొదటి అక్షరం తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు
- ఆదాయం : 2
- రాజపూజ్యం : 5
- వ్యయం: 14
- అవమానం : 2
- గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు తామ్రమూర్తిగా తరువాత 18.10.2025 నుండి సువర్ణమూర్తిగా తదుపరి 05.12.2025 వరకు తామ్రమూర్తిగాను ఉగాది వరకు సంచారము.
- శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు రజిత మూర్తిగా సంచారము.
- రాహువు:18.05.2025 వరకు తామ్రమూర్తిగాను మరల ఉగాది వరకు సామాన్యం.
- కేతువు: ఉగాది నుండి మరల ఉగాది వరకు 10 తామ్రమూర్తిగా సంచారము.
ఈ రాశి స్త్రీ పురుషులకు అనేక విధములుగా అర్థం కాకుండా ఉంటుంది. రైతు సోదరులు చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. వృత్తి ఉద్యోగస్తులు నిర్ణయ లోపం వలన అనేక విధములుగా చిక్కులు చికాకులకు గురికాగలరు. లాయర్లు డాక్టర్లు ఉన్న ధనము స్థిరాస్తులు ఖరీదు చేయగలరు. కాంట్రాక్టరు కొన్ని అనుకూలంగాను కనిపించినప్పుడు ధనమును దారి మళ్లించగలరు. నిల్వ ధనం ప్రక్కకు వెళుతుంది. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. వెండి, బంగార వ్యాపారములు స్టాకులు పెంచుకొనగలరు.
►ALSO READ | విశ్వావసు సంవత్సరంలో తులారాశి వారి జాతకం.. ఆదాయం, వ్యయం ఎలా ఉన్నాయంటే..?
సిమెంట్, ఐరన్, కంకరు వారికి అనుకూలం. టింబర్ వ్యాపారం సామాన్యం. బిగ్ ఇండస్ట్రీ వారికి ఆదాయమునకు మించిన ఖర్చులు. స్మాల్ ఇండస్ట్రీ వారికి పైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయములతో నలిగిపోగలరు. కిరాణ ఫ్యాన్సీ మెడికల్ వస్త్ర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయములలో మనస్తాపమునకు అర్థం కాకుండా గురి అవ్వగలరు. పౌల్ట్రీ మత్య్స పరిశ్రమ పాడి పరిశ్రమ సాఫీగా నడిచిపోగలదు. చిట్స్ షేర్స్ అర్థం కాదు. అభివృద్ధి కలిగి ఉంటారు.
తొందరపాటు ఆలోచనలతో బ్యాంకు బ్యాలెన్స్ ఖర్చు చేస్తారు. మరల అప్పులు చేస్తారు. కారణం స్థిరాస్తులు ఖరీదు చేయగలరు. అలాగని మైనస్ లేదు. డబ్బు ఉంచరు. ఎవరికి ఏ విధమైన హామీలు ఉండరాదు. అభివృద్ధి సంబంధించిన పనులు వాయిదా వేయరు. కారణం డబ్బు నిలవ ఉంచరు కనుక ముందు వెనక ఆలోచన చేసి ముందుకు సాగండి. గ్రామంలో కొన్ని విషయములకు దూరంగా ఉండండి. విందులు వినోదములకు పెద్ద పీట వేస్తారు. ఖర్చులకు వెనుకకు జరగండి. ఏ విషయమైన గమనించగలరు.
కాని కంట్రోల్తొందరగా కారు. మీరు తొందరపడరాదు. ఇతరులకు సహాయపడగలరు. ఇతరులను వాడుకొనగలరు. గతంలో కోర్టు గొడవలు రాజీ మార్గమున్నది. క్లియర్ చేసుకుందాం అనుకుంటే రాజీకుదురుతుంది. మీ నుండి మాట వస్తే అనుకూలించగలవు. మీ ప్రయత్న లోపం లేకుండా ఆలోచన చేయండి. కష్టనష్టములు వచ్చి నీకు మీ ఆలోచన చేయండి. జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతారు. బంధువులతో చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించండి.
గురుచరిత్ర పారాయణం శనగల గుగ్గుళ్ల ప్రసాదములు పంచండి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించండి. ఎరుపు నువ్వులు కిలోంబావు కడిగి ఎండపోసినవి శనికి పూజలు మిగిలినవి దానం నలుపు వస్త్రం అరమీటరు తైలాభిషేకం చేయించండి. జ్యేష్ట నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరం ధరించండి. కుడిచేతి చిటికెన వ్రేలుకు బంగారంలో మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అలంకరణ చేయించి చక్కెరపొంగలి ప్రసాదములు సమర్పణ చేయండి.
►ALSO READ | వచ్చినట్లే వచ్చి.. వెంటనే పోతాయ్.. విశ్వావసు సంవత్సరంలో సమానంగా ధనస్సు రాశి ఆదాయవ్యయాలు
మంగళ వారం రాత్రి పచ్చ పెసలు మీరు పడుకొన్న వైపు నానపెట్టి బుధవారం అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణలు చేయండి. ధ్యానం యోగ చాలా అవసరం ఉన్నది. ఆక్యుప్రెషర్, ఆయుర్వేద మందులు వాడి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవి నివారణ చేసుకొని వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అదృష్ట సంఖ్య 9.