కొత్త సంవ్సతరం(2025)లో చాలామంది జీవితాల్లో మార్పులు సంభవించనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆదాయం అభివృద్ది చెందుతుంది. మరికొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. 2025 కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఆర్థికంగా కలసి వస్తుంది. ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...
మేష రాశి: .. 2025 సంవత్సరంలో మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి పరంగా కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు 2025లో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. మీ నిర్ణయాలను వ్యూహాత్మకంగా అభివృద్ది చేస్తారు. ఆర్థిక పరంగా కొన్ని లాభాలుంటాయి. ఈ ఏడాది సొంతిల్లు కల నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపుబాధ్యలు పెరిగినా.. సంతృప్తికరంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. మొత్తంగా పరిశీలిస్తే.. ఏ పని తలపెట్టినా.. విజయవంతంగా పూర్తవుతుంది.
వృషభరాశి : ఈ రాశి వారు 2025వ సంవత్సరంలో స్థిరపడే అవకాశం ఉంది. నెట్ వర్కింగ్ రంగంలో పనిచేసేవారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు. కాంట్రాక్టర్లు.. వ్యాపారస్తులకు ఈ ఏడాది ద్వితీయార్ధంలో కలసి వస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు 2025లో వేతనం పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. కొత్త వస్తువులు కొనే అవకాశంతో పాటు.. విద్యార్థులకు అన్నీ విధాల అనుకూలంగా ఉంటుంది.
మిథునరాశి : ఈ రాశి వారికి 2025 చాలా మంచి అవకాశాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ తరువాత ఈ రాశి కెరీర్ లో పురోగతి ఉండే అవకాశం ఉంది. అయితే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారు అన్నీ రంగాల్లో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు. వీరు చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా.. పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు.. కాంట్రాక్టర్లు.. సినీ.. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓవరాల్ గా పరిశీలిస్తే ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా.. చివరి నిమిషంలో మీరే విజయం సాధిస్తారు.
కర్కాటకరాశి : 2025 లో ఈ రాశివారు కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. భవిష్యత్తుకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు ఉన్న అప్పులను 2025 నవంబర్ లో తీర్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కంపెనీ పనిపై విదేశాలకు వెళతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావ డం వంటివి జరుగుతాయి. వ్యాపారస్తులు.. కాంట్రాక్టర్లకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద 2025 ఏడాదంతా కాస్తంత సంతృప్తికరంగా.. అనుకూలంగానే సాగిపోతుంది.
సింహరాశి : 2025 వ ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలత పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే గురుడు 10, 11వ స్థానంలో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఏడాది చివర్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్చి నెలలో వృత్తిపరమైన సంబంధాలు బలోపేతం అవుతాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాదంతా కొద్దిగా అనుకూలంగానే సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ వింటారు.
కన్యారాశి : ఈ రాశివారు 2025లో కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింట్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు కొన్ని ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంది. పనిభారంతో ఆఫీసులో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్ధికంగా కొంత ఆందోళన కలిగినా.. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పూర్వీ్కుల ఆస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. అ నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం రాకపోయినా.. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది.
తులారాశి : ఈ రాశి వారికి2025లో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. అయితే శని దేవుడు మార్చి వరకు ఉద్యోగులకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పని చేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయాన్ని కొనసాగించాలి.అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అయితే కొందరు స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి 2025 మార్చి 29 తరువాత కష్టాలనుంచి విముక్తి కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. వృత్తి.. ఉద్యోగాలు సానుకూల ఫలితాలుంటాయి. డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో . ఆర్థిక నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుంది. కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందం ఉంటుంది. పెళ్లికానివారికి వివాహ సూచనలున్నాయి. వృత్తి.. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడుతుంది. కొన్ని శుభపరిణామలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు జీతంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్థాన చలనం ఉంటుంది.
మకరరాశి : 2025 సంవత్సరంలో మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలతో దూసుకెళ్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లతో ట్రాన్సఫర్లు , ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్వీ్కుల ఆస్తి రావడంతో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. ఆర్థిక లావా దేవీలు బాగా కలిసి వస్తాయి.
కుంభరాశి: 2025 వ సంవత్సరం ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కెరీర్ పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి : ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది,. మార్చి తరువాత కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మే తరువాత సమస్యలు పరిష్కారమవుతాయి. . వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గే అవకాశం కూడా ఉంది. కెరీర్ విషయంలో ఆశించినంతగా ఉండదు. ఉద్యోగస్తులకు పరిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయంలో లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు. ఈ ఏడాది అక్టోబర్ తరువాత పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.