
రోజూ పొద్దున్నే లేవడంతోనే చాలామంది ఈ రోజు జాతకం ఎలా ఉంది.. ఎలాంటి లాభ నష్టాలు.. కష్టసుఖాలు ఉన్నాయి..అనే విషయం గురించి ఆలోచిస్తూ మన పని మనం చేసుకుంటాం. అయితే జ్యోతిష్యం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు (2025 ఫిబ్రవరి 21) ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రోజు (2025, ఫిబ్రవరి 21 శుక్రవారం) మేష రాశి వారు చేసే పనిలో ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి.. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
సమాజంలో మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ప్రేమ భాగస్వామి సలహాతో ఏ సమస్యకైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై చూపే అవకాశం ఉంది. ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల విషయంలో శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ప్రేమ .. పెళ్లి సంబంధాల వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.ర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మిథున రాశి: ఈరోజు మిథునరాశి వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తారు. కొన్ని కారణాల వలన మీ వ్యక్తిగత పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నిదానంగా పనులు పూర్తవుతాయి. ఎవరితోను వాదనలు పెట్టుకోకండి.. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి : ఈ రోజు మీ పాత స్నేహితులను కలుస్తారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ( ఫిబ్రవరి 21) ఇంట్లొ మంచి వాతావరణం ఏర్పడుతుంది.ఎవరు ఏమనుకున్నా మీ పని మీరు చేసుకోండి. ఈ రోజంతా బాగానే ఉంటుంది. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలనా జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పిల్లల విషయంలో శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ఇంట్లో పెద్దవారి సలహా.. సూచనలను పాటించండి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కెరీర్ విషయంలో అభివృద్ది కనపడుతుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ( ఫిబ్రవరి 21) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి పెద్దల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితంలో ఉన్నవారు అధికంగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.నిరుద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి : ఈ రోజు కొంత ధనం అనవసరంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచన లున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
మకర రాశి: ఈ రోజు ( 2025 ఫిబ్రవరి 21) బిజీ బిజీగా గడుపుతారు. అనవసర విషయాలు పక్కనపెట్టి మీరు చేసే పనిపై దృష్టి పెట్టండి. బంధువులు.. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉన్నా.. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొందరు బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పని భారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. సొంత పనుల విష యంలో శ్రద్ధ పెట్టడం మంచిది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి: ఈ రాశి వారికి మనస్సులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్త్రీ మూలకంగా లాభం ఉంటుంది. డబ్బు లావా దేవీల విషయంలో ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వకండి. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.