
తెలుగు క్యాలెండర్ ప్రకారం.. క్రోధి నామ సంవత్సరం 2025, మార్చి 29తో ముగిసింది. 2025, మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. కాగా.. హిందూ పంచాంగం ప్రకారం ఒకొక్క తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. మార్చి 30 వ తేదీ ఆదివారం పాడ్యమి తిధి నుంచి ఈ విశ్వావసు నామ సంవత్సర మొదలైంది. మనిషి ప్రకృతికి.. కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు.. మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది.
ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు. ఉగాది పంచాంగం ప్రకారం విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశుల వారి జాతకాలు ఎలా ఉన్నాయి..? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి..? అవమానం, రాజపూజ్యం ఎలా ఉన్నాయో.. రాశుల వారిగా కింద అందించాం. మరీ మీది ఏ రాశో ఒకసారి చదువుకోండి.