ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరి ఒడిశా వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు చనిపోయారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
వీరంతా హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. తీర్థయాత్ర నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది