కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం..నుజ్జునుజ్జయిన బొలెరో.. ముక్కలైన శరీర భాగాలు

కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం..నుజ్జునుజ్జయిన బొలెరో.. ముక్కలైన శరీర భాగాలు

యూపీలోని ప్రయాగ్ రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (ఫిబ్రవరి15) తెల్లవారు జామున యమునానగర్లోని మేజా పోలీస్ స్టేషన్ పరిధిలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే చనిపోయారు.మృతులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా గుర్తించారు. మధ్య ప్రదేశ్ కు చెందిన బస్సు, బొలెరో వాహనం ఛత్తీస్గఢ్ నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వస్తున్నట్లు తెలుస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ జిల్లా కోర్బా జిల్లా నుంచి కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు బొలెరో వాహనంలో వస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడ్డారు..గాయపడిన వారిలో బస్సు ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.