
మన దేశంలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వాడేది రైలు మార్గాన్నే. బస్సు, ఫ్లైట్ టికెట్లతో పోలిస్తే రైలు టికెట్ చాలా చీప్ గా ఉండటం ఒక కారణమైతే, రైలు ప్రయాణం చాలా కంఫర్టబుల్ గా ఉండటం మరొక కారణమని చెప్పచ్చు. రోడ్డు మార్గంతో పోలిస్తే, రైలు మార్గంలో ప్రమాదాల శాతం కూడా తక్కువ. అయితే, రైలు ప్రమాదం జరిగితే గనక చాలా పెద్ద డ్యామేజ్ తో పాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉంది.
2023 నుండి ఇండియాలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. తాజాగా సోమవారం పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 15మంది మరణించగా 60మందికి గాయాలయ్యాయి. డార్జిలింగ్ వద్ద కాంచన గంగా ఎక్స్ ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Goods train rams into Kanchanjunga Express train in Darjeeling district in West Bengal, several feared injured!
— Dipankar Kumar Das (@titu_dipankar) June 17, 2024
Another tragic incident of Train collision in Modi's rule.
While Railway Minister @AshwiniVaishnaw is busy in posting Vande Bharat reels.#TrainAccident pic.twitter.com/RUPzSSiC61
ఇండియాలో 2023 నుండి జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే:
బాలాసోర్ ట్రాజడీ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానిపై ఒకటి పట్టాలు తప్పటంతో ఘోర ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించగా 900 మందికి పైగా గాయాలయ్యాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగ బజార్ స్టేషన్‌లో గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది ఇండియన్ రైల్వే హిస్టరీలోనే అత్యంత ఘోర రైల్వే వైపత్తులలో ఒకటి.
ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం: అక్టోబర్ 2023లో విశాఖ - పలాస, విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మరణించగా పలువురికి గాయాలయ్యాయి.
బక్సర్ రైలు ప్రమాదం: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో అక్టోబర్‌లో 12506 ఆనంద్ విహార్ టర్మినల్-కామాఖ్య జంక్షన్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కి సంబంధించిన ఆరు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో నలుగురు మరణించగా 70 మందికి పైగా గాయాలయ్యాయి.
లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో అగ్ని ప్రమాదం: ఆగస్ట్ 2023లో, మధురై జంక్షన్‌లో ఉన్న లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది మరణించారు. ఈ అగ్ని ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి.
మధుర EMU రైలు ప్రమాదం: సెప్టెంబరు 2023లో, మథురలోని షకుర్ బస్తీ నుండి ఒక EMU రైలు పట్టాలు తప్పటంతో ఈ ప్రమాదం జరిగింది.