రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో ఘోరం వెలుగులోకి వచ్చింది. బుధవారం వేణు గోపాలస్వామి దేవస్థానం సమీపంలోని చెట్ల పొదలో ఓ మహిళ మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో స్థానికులు గుర్తించారు. మహిళ మృతదేహం కుళ్లిపోయి ఉంది. పక్కనే మద్యం తాగిన ఆనవాళ్ళతో పాటు ఒక సంచి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులతో పాటు క్లూస్ టీం చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.