సికింద్రాబాద్, వెలుగు : దేశ విభజన టైమ్‌లో ప్రజల పోరాటాలు, త్యాగాలు స్మరించుకునేందుకు ప్రతి ఏటా ఆగస్టు 14న నిర్వహిస్తున్న హర్రర్స్ ఆఫ్ పార్టిషన్ ప్రోగ్రామ్‌ను రైల్వే శాఖ సోమవారం నిర్వహించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 స్టేషన్లలో హర్రర్స్ ఆఫ్ పార్టిషన్ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. దేశాన్ని విభజిస్తున్న టైమ్‌లో భారతీయులు అనుభవించిన బాధలను ప్రయాణికులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, బేగంపేట, వరంగల్, కాచిగూడ, నిజామాబాద్ స్టేషన్లలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించింది.
ఏపీలో కర్నూల్ సిటీ, రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ, తుని, కావలి, అనకాపల్లి, కాకినాడ టౌన్, కర్నాటకలోని రాయచూర్ తదితర రైల్వే స్టేషన్స్‌లో హర్రర్స్ ఆఫ్ పార్టిషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. విభజన సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ అన్నారు. తాము ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అప్పటి ప్రజల వేదనను ప్రయాణికులకు తెలియజేసిందని తెలిపారు. తమ పూర్వీకుల త్యాగాలు ఐక్యతకు స్ఫూర్తి ఇచ్చాయని, సామరస్యం, సౌభాగ్యం యుగాన్ని తీసుకొచ్చాయని అన్నారు.