ఎన్‌‌‌‌పీఏలో ముగిసిన హార్స్‌‌‌‌ చాంపియన్ షిప్‌‌‌‌

ఎన్‌‌‌‌పీఏలో ముగిసిన హార్స్‌‌‌‌ చాంపియన్ షిప్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : నేషనల్‌‌‌‌ పోలీస్ అకాడమీ( ఎన్‌‌‌‌పీఏ)లో గతనెల 26న ప్రారంభమైన 42వ ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌‌‌‌షిప్, మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్–2023 శుక్రవారం ముగిసింది. ఇందులో దుండిగల్‌‌‌‌ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ అకాడమీ కమాండెంట్‌‌‌‌వీఎస్‌‌‌‌ఎం ఎయిర్‌‌‌‌మార్షల్‌‌‌‌ ఎస్‌‌‌‌. శ్రీనివాస్‌‌‌‌, ఎన్ పీఏ అకాడమీ డైరెక్టర్‌‌‌‌ ‌‌‌‌అమిత్‌‌‌‌గార్గ్‌‌‌‌ పాల్గొన్నారు. 

పోటీల్లో ముందుగా సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌, బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళా పోలీసులు సహా మొత్తం 605 మంది అశ్వకదళాల (మౌంటెడ్‌‌‌‌)పోలీసులు పాల్గొన్నారు. 311 గుర్రాలు 34 ఈవెంట్స్‌‌‌‌లో నైపుణ్యం ప్రదర్శించాయి. హార్స్ రైడింగ్‌‌‌‌లో రాజస్థాన్‌‌‌‌కు చెందిన దేవేంద్ర సింగ్‌‌‌‌ ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన రైడ్ చేసిన గుర్రం రోహిణి కూడా పోలీసులు సన్మానించారు. హరియాన,అసోం రైఫిల్స్‌‌‌‌, పంజాబ్‌‌‌‌ పోలీసులు గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు అందుకున్నారు.14 మంది మహిళల్లో అసోం రైఫిల్స్‌‌‌‌కు చెందిన అవంతి లోథి విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.