హార్టీ కల్చర్ రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యాన పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు వందశాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పలు పథకాల కింద నిధులను మంజూరు చేస్తున్నది. ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై పథకంలో ఉద్యాన పంటల సాగుకు పెద్దపీట వేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు 2005, 2006 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. తక్కువ భూమి ఉండి .. హార్టికల్చర్ సాగు చేసే సన్న.. చిన్న కారు రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని పొందితే అధికంగా లాభాలు వస్తాయి.
ఉద్యాన పంటలకు సబ్సిడీ
పెట్టుబడి వ్యయం ఎక్కువ కావడంతో సన్న, చిన్నకారు రైతులు తోటల సాగు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే 13 రకాల పండ్ల తోటల సాగుకు ఆర్థిక సాయం అందించేందుకు సంకల్పించి ప్రోత్సాహం కల్పిస్తున్నది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోట, జీడిపప్పు, మునగ, డ్రాగన్‌ఫ్రూట్, అరటి, ఆపిల్‌బేర్, దానిమ్మ, కొబ్బరి రకాల పంటలను సాగుకు సాయమందించాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఉద్యానవన పంటలకు అంటే పండ్లు, కూరగాయలకు డిమాండ్ పెరిగింది. హార్టీకల్చర్ పంటలకు మంచి ధర లభిస్తుండడంతో రైతులు కూడా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలు పండ్లు, కూరగాయల సాగును పెంచుతున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీనికి తోడు ప్రభుత్వాలు నూరు శాతం సబ్సిడీ ఇవ్వడంతో ఎక్కువ మంది రైతులు హార్టీ కల్చర్ సాగు వైపు దృష్టి సారించారు. కాని చాలా మంది రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎలా పొందాలో తెలియక సబ్సిడీ కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 35 నుంచి 50 శాతం అందించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
పండ్ల తోటల సంరక్షణ బాధ్యతను నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే వహిస్తుంది.. మొక్కలు నాటిన ఏడాది నుంచి మొత్తం నాలుగేండ్ల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు మొక్కలను ప్రభుత్వ నర్సరీల ద్వారా కానీ రిజిస్టర్డ్ ప్రైవేట్ నర్సరీల ద్వారాగాని కొనుగోలు చేసుకోవచ్చును. పండ్ల తోటల సాగుకు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగి ఉండి, 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులు. రైతులు లాభదాయక పండ్ల తోటల సాగును చేపట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నది. ఈ క్రమంలోనే మొక్కల కొనుగోలు నుంచి నాటడంతోపాటు నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం అందజేస్తుంది.
నేషనల్ హార్టికల్చర్ మిషన్ పథకం ప్రయోజనాలు
- 1. తక్కువ భూమి ఉండి చిన్న, సన్న కారు రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి
- 2.ఒకసారి పంట పండితే, రైతులు చాలా సంవత్సరాలు పంటలను పండించగలరు.
- 3. నేషనల్ హార్టికల్చర్ మిషన్ పథకంతో దేశవ్యాప్తంగా పండ్లు, పూలు , కూరగాయల సాగు పెరిగింది.
- 4. రైతులు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.
- 5.ఇతర పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలకు తక్కువ నీటిపారుదల అవసరం.
- 6. హార్టికల్చర్ కింద పండించిన పంటలకు డిమాండ్ ఏడాది పొడవునా మార్కెట్‌లో ఉంటుంది,
- 7. పంటను అమ్మేటప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పంటను అమ్మేందుకు నేషనల్ హార్టికల్చర్ మిషన్ స్కీమ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు https://nhb gov.in/లో చేయవచ్చు.
నేషనల్ హార్టికల్చర్ మిషన్‌లో సబ్సిడీని ఎలా పొందాలంటే కావాలసిన ధృవీకరణ పత్రములు
- 1. పాన్ కార్డ్
- 2. బ్యాంక్ పాస్ బుక్
- 3. ఆధార్ కార్డ్
- 4. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- 5. మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి.
దరఖాస్తుచేసే విధానం...
- రైతు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా సమీపంలోని ఈ -మిత్ర కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుదారు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన రసీదును ఆన్‌లైన్‌లో మాత్రమే పొందగలరు.
- దరఖాస్తు సమయంలో పత్రాలు - ఆధార్ కార్డ్ / జనాధన్ కార్డ్, జమాబందీ కాపీ (ఆరు నెలల కంటే ఎక్కువ కాదు), కుల ధృవీకరణ పత్రం, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (R.C.).