పామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు

పామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు

ఆమనగల్లు, వెలుగు :  పామ్ ఆయిల్ సాగు తో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చునని షాద్ నగర్ హార్టికల్చర్ ఆఫీసర్​  ఉషారాణి చెప్పారు. మంగళవారం  తలకొండపల్లి మండల కేంద్రంలో ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పంట సాగు కోసం ప్రభుత్వం మొక్కలపై 90 శాతం, డ్రిప్ పై 80 - 100 శాతం సబ్సిడీ, మెయింటెనెన్స్ ఎకరానికి 4,200 రూపాయలు నాలుగు సంవత్సరాల వరకు  అందుతుందని తెలిపారు.   ప్రభుత్వం ఇచ్చే రాయితీలను  ఉపయోగించుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏరియా మేనేజర్ ప్రమోద్, ఏఈఓ లు శ్రీనాథ్, అనిత, నికిత, శ్రీలత, విజయ్, నికిత, ఫీల్డ్ అధికారులు రుక్మిణి, శ్రీనివాస్, నవీన్ రైతులు  పాల్గొన్నారు.