ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలన్న ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రమేశ్​చంద్ర

 ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలన్న ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్  రమేశ్​చంద్ర

ఉప్పునుంతల, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని, రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్  రమేశ్​చంద్ర సూచించారు. మండలంలోని 30 పడకల ఆసుపత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు.

రోగులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరుపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. త్వరలోనే ఆసుపత్రిలో ఆపరేషన్  థియేటర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారి డాక్టర్  భిక్కులాల్, డాక్టర్ శివలీల, ఫార్మసిస్ట్  శ్రీనివాసులు, ఎల్టి పురేందర్, స్టాఫ్  నర్స్ వెంకటమ్మ ఉన్నారు.