
కాశీబుగ్గ, వెలుగు: పట్టణంలోని అజర హాస్పిటల్స్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు అనుమతి లభించిందని హాస్పిటల్ ఎండీ శివసుబ్రహ్మణ్య తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన మానవ అవయవ మార్పిడి కమిటీ విభాగం చైర్మన్ అనుమతి మంజూరు సర్టిఫికేట్ జారీ చేసినట్టు ఆయన వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రజలకు మొదటి సారిగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని, ఇప్పటికే పలు వైద్య విభాగాలలో సేవలు అందిస్తోందని ఆయన గుర్తు చేశారు.