- సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్
నిజామాబాద్ సిటీ, వెలుగు : జిల్లా ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జీజీహెచ్లో ఇటీవల న్యూరో సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం యూరాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ వారంలో షైక్ జానీ
రవి అనే పేషెంట్లకు కిడ్నీల్లో రాళ్లను చికిత్స ద్వారా తొలగించామని తెలిపారు. యూరాలజీ డాక్టర్ శబరినాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసినట్టు చెప్పారు. ప్రజలు ఎవరైనా కిడ్నీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లయితే జీజీహెచ్లో సంప్రదించాలని కోరారు.