బెల్లంపల్లి పట్టణంలో రూ.1.36 కోట్ల నిధులతో బాలికల కోసం నిర్మించిన హాస్టల్ భవనం అలంకార ప్రాయంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 23న విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ.. నేటికీ బాలికలకు కేటాయించలేదు.
అసౌకర్యాల మధ్య కొనసాగుతున్న బీసీ బాలికల వసతి గృహంలోని స్టూడెంట్లను ఇందులోకి తరలించాలని డిమాండ్లు వినిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
– వెలుగు, బెల్లంపల్లి