హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, లేడీ సూపరింటెండెంట్, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.  ఈ మేరకు ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్ఎల్)నూ వెబ్​సైట్​లో  పెట్టింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు 81,931 మందితో, వార్డెన్ అండ్ మ్యాట్రిన్ పోస్టులకు 497 మందితో కూడిన జీఆర్ఎల్ ప్రకటించింది. 2022లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా జూన్ లో పరీక్షలు జరిగాయి. శుక్రవారం వీటి ఫలితాలను అధికారులు విడుదల చేశారు. జీఆర్ఎల్ వివరాలను టీజీపీఎస్సీ వెబ్ సైట్​లో పెట్టారు.