హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్.. స్టేట్ వైడ్​గా 574 మంది కొలువులకు ఎంపిక

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్.. స్టేట్ వైడ్​గా 574 మంది కొలువులకు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్), మెంటర్ పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ లిస్టులను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 574 మందిని పోస్టులకు ఎంపిక చేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో 581 వార్డెన్ పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 24 నుంచి 29 వరకూ పరీక్షలు నిర్వహించారు. దీనికి 1.45 లక్షల మంది అప్లై చేయగా, 82 వేలకు పైగా అభ్యర్థులు అటెండ్ అయ్యారు. వీటి ఫైనల్ సెలెక్షన్ లిస్టును సోమవారం టీజీపీఎస్సీలో పెట్టారు.

జనరల్ కేటగిరిలో 561 మంది, దివ్యాంగుల కేటగిరిలో13 మంది ఉద్యోగాలు పొందారు. కాగా, త్వరలోనే వీరికి డిపార్ట్ మెట్ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్​లు ఇవ్వనున్నారు. కాగా, వివిధ కేటగిరిల్లో మరో ముగ్గురు అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ చేయలేదు. మరో రెండు పోస్టుల ఫలితాలు ఆపేయగా, 2 హెచ్​హెచ్​ కేటగిరి పోస్టులను తర్వాత ప్రకటిస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.