మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావును ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. సుధాకర్ రావు తన పార్టీ భవిష్యత్తులో అవకాశాలు రాకున్నా.. తమ పార్టీలోకి వస్తాయని అనడం చర్చనీయాంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో చెన్నాడి మార్తాండరావు జ్ఞాపకార్థం అతని సోదరుడు, మాజి ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు తన సొంత ఖర్చులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల.. గ్రామ పంచాయితీ కార్యాలయంను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. త్వరలోనే రాష్ట్రంలోని గురుకులాలను కొత్త బిల్డింగులను నిర్మిస్తామని.. విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని.. ఇటువంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయం చేస్తామని.. రాష్ట్రంలో మార్పు వచ్చిందని తెలిపారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఉంటుందని.. రాష్ట్రంలోని చాలా మంది అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని పేర్కొన్నారు. పుట్టిన ఊరుకు సేవ చేయడం చాల గొప్ప విషయమని చెప్పారు.