తెలంగాణలోని పరిశ్రమలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. క్వశ్చన్ అవర్ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి.. అరబిందో పరిశ్రమ వ్యర్థాలు పంటపొలాల్లోకి రిలీజ్ చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల వ్యర్థాలతో చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయన్నారు.
పరిశ్రమలకు ఇచ్చిన భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. ప్రొడక్షన్ ప్రారంభించని పరిశ్రమల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు .. ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల భూములు వెనక్కి తీసుకుంటామన్నారు . అలాగే భూములను మిస్ యూస్ చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమలపై ఫిబ్రవరి వరకు కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.
Also Read:-సర్పంచ్ల పెండింగ్ బిల్లులు .. అసెంబ్లీలో సీతక్క vs హరీశ్
తెలంగాణలో35 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల కాలుష్యాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. పరిశ్రమల కాలుష్య వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయడం లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. పీసీబీ రూల్స్ ప్రకారం కాలుష్యంపై చర్యలు ఉంటాయన్నారు. పారిశ్రామిక పార్కుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.