ఇల్లందు సీటుపై BRSలో హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సీటుకు ఎసరు పెడుతున్నట్టు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఇల్లందు సీటుపై మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత కన్నేసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఇల్లందు నుంచి తానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఎంపీ కవిత. మరోవైపు ఇల్లందు నుంచి తన అక్క కూతురు, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు నాయక్ ను బరిలో పెట్టాలని మంత్రి సత్యవ్రతి ఆలోచన అని చెబుతున్నారు. ఓ వైపు సత్యవతి రాథోడ్, మరోవైపు మాలోతు కవిత ఎవరికివారుగా ప్రయత్నాలు చేస్తున్నారంట. తమలో ఎవరికి సీటు ఇచ్చినా..పార్టీని గెలిపిస్తామని హైకమాండ్ కు చెప్పినట్టు సమాచారం.
ఇల్లందులో సిట్టింగ్ కు ఫిట్టింగ్ అంతా ఎమ్మెల్యే స్వయంకృపరాధమేనని అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇల్లందులో ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే భర్త హరిసింగ్ హడావుడే ఎక్కువ ఉంటుదని సొంత క్యాడరే ఆరోపిస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహారాలు నడిపిస్తారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుందని ఎమ్మెల్యేనే.. భర్తకు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు ఇప్పించారట. అప్పటి నుంచి ఇంకా స్పీడ్ పెంచారట ఎమ్మెల్యే భర్త.
ఎమ్మెల్యే హరిప్రియ భర్త తీరుతో నియోజకవర్గంలోని ZPTC, MPTC, కౌన్సిలర్లు, లోకల్ లీడర్లు కూడా పార్టీకి అంటిముట్టనట్లుగానే ఉంటున్నారట. హరిప్రియకు ఈసారి సీటు ఇవ్వొద్దని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, జిల్లాధ్యక్షుడు రేగా కాంతారావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని కంప్లైంట్ చేశారట. BRSకు బలమైన క్యాడర్ ఉందని, ఎమ్మెల్యే భర్తను చూసే చాలా మంది పార్టీకి దూరమవుతున్నట్లు హైకమాండ్ గుర్తించిందట. హరిప్రియను మారిస్తే ఎట్ల ఉంటుందనే చర్చ కూడా చేస్తోందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
ఇల్లందులో ప్రత్యామ్నాయ లీడర్ పై హైకమాండ్ చూస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇల్లందులో ఈసారి కొత్త ఫేసే ఉంటుందని సమాచారం. అందుకోసమే అటు మంత్రి సత్యవతి రాథోడ్, ఇటు ఎంపీ కవిత ముందస్తు ప్రిపేరేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=J2UxTxcnJWg