హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ ఆత్మహత్య

ఎల్ బీనగర్, వెలుగు: లాడ్జిలో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్​సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా బండమీదిపల్లికి చెందిన పవన్(21) సిటీలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్​మెంట్ కోర్సు చేస్తున్నాడు. మంగళవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పవన్ రాసిన సూసైడ్ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 


మద్యానికి బానిసై ఆటోడ్రైవర్..
మాదాపూర్: ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్న ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఏనగర్​లో ఉండే కె. వేణు(42) ఆటో డ్రైవర్​. నాలుగు నెలలుగా మద్యానికి బానిసై ఆటో కూడా నడపకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అతడి భార్య కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని టైంలో  వేణు ఫ్యాన్​కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న మియాపూర్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.