న్యూఢిల్లీ: ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో ఇటీవల సోషల్‌మీడియా వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన తమిళనాడు రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్.. ఫైనాన్స్మినిస్టర్ నిర్మలా సీతారామన్‌కు ప్రైవేట్‌గా క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ వీడియోను బీజేపీ శుక్రవారం బయటపెట్టడంతో కాంగ్రెస్మండిపడింది. రెస్టారెంట్ యజమానిని బీజేపీ బెదిరించిందని, ఇందుకు నిర్మల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
జీఎస్టీ గురించి నిర్మలను ప్రశ్నిస్తూ తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్స్ యజమాని శ్రీనివాసన్ ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వైరల్ అయింది. దీనిపై రెస్టారెంట్యజమాని తిరిగి నిర్మలకు క్షమాపణ చెప్పడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందిస్తూ.. అన్నపూర్ణ రెస్టారెంట్స్ ఓనర్ వ్యవహారంలో నిర్మలా సీతారామన్ తీరు అవమానకరంగా ఉందన్నారు.
ఇది వ్యాపారులకు అవమానం: రాహుల్ గాంధీ
నిర్మలకు హోటల్స్ యజమానితో క్షమాపణలు చెప్పించడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన బిలియనీర్ స్నేహితుల కోసం ప్రధాని రూల్స్మారుస్తారని విమర్శించారు. చిన్న వ్యాపారులను మాత్రం నోట్ల రద్దు, పన్నులు, జీఎస్టీల పేరుతో ఇబ్బంది పెడతారని విమర్శించారు. క్షమాపణల పేరుతో వారిని అవమానిస్తున్నారని ఫైరయ్యారు. కాగా, ఈ క్షమాపణ వీడియోపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో తమిళనాడు బీజేపీ చీఫ్అన్నామలై క్షమాపణలు చెప్పారు.