
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అర్థరాత్రి ప్రమాదం జరిగింది. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లోని గది నంబర్ 314లో సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భయాందోళనతో భక్తులు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి చేరుకుని భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. హోటల్ ను సీజ్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.