Lifestyle: హోటల్​ నుంచి ఏం తెచ్చుకోవచ్చు..ఏం తెచ్చుకోకూడదో తెలుసా...

ప్రపంచంలో చాలామంది టూరెస్ట్​ లకు వెళుతుంటారు.  ఇక ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ మన బంధువులు గాని... స్నేహితులు కాని... తెలిసినవారు కాని ఎవరూ లేనప్పుడు  అక్కడున్న హోటల్స్​ లో స్టే చేస్తాం. అనేక రకాలైన కేటగిరీల్లో హోటల్​ యజమానులు అద్దెకు ఇస్తుంటారు.  ఆ రూంలలో కొన్ని సౌకర్యాలను కూడాఏర్పాటు చేస్తారు.  ఆ రూంలలో స్టే చేసేవారి సౌకర్యార్దం కొన్ని వస్తువులను ఉంచుతారు.  వాటిలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు.. కొన్నింటిని వాడుకొని అక్కడే వదిలేయాలి.  ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చు.. ఎలాంటివి తెచ్చుకోకూడదో తెలుసుకుందాం. . . . 

బాలి ద్వీపానికి ఓ ఫ్యామిలీ  టూర్ కెళ్లింది. ఆ ఫ్యామిలీ  అక్కడ ఒక హోటల్లో స్టే చేశారు. అయితే వచ్చేటప్పుడు హోటల్ లోని కొన్ని వస్తువుల్ని తీసుకుని బయల్దేరారు. అనుమానమొచ్చిన హోటల్ స్టాఫ్ వాళ్ల లగేజ్ చెక్ చేస్తే హోటల్ సామగ్రి దొరికింది.  

టూరిస్టులకు ఆ ప్రాంతంలోని హోటల్లో అక్కడి వస్తువుల విషయంలో అవగాహన కలిగి ఉండాలి. ఏ వస్తువు తీసుకెళ్లొచ్చు.. ఏది తీసుకెళ్లకూడదో తెలిస్తే సమస్యేం ఉండదు. ఏ హోటల్లో స్టే చేసినా కొన్ని వస్తువుల్ని హోటల్ సిబ్బంది ప్రొవైడ్ చేస్తారు. వాటిలోంచి కొన్నింటిని పూర్తిగా కస్టమర్లు వాడుకోవచ్చు. అవసరమైతే వెంట తీసుకెళ్లొచ్చు కూడా. హోటల్ నుంచి కస్టమర్లు తీసుకెళ్లగలిగే వస్తువులివి.

  •  హోటళ్లలో కస్టమర్లు స్నానం చేసేందుకు టవల్స్, సోప్స్, షాంపూలు వంటివి ప్యాకేజీలో భాగంగానే అందిస్తారు. వీటిలోంచి సబ్బులు, షాంపూలు, కండీషనర్లు, బాడీ లోషన్స్ వంటివి కస్టమర్లు తీసుకెళ్లొచ్చు, 
  • టవల్స్ మాత్రం వాడుకుని తిరిగిచ్చేయాలి.
  •  హోటల్లో హెయిర్ డ్రయ్యర్లు. బాత్రూమ్ స్లిప్పర్లు ఉంటాయి. స్లిప్పర్లను వెంట తీసుకెళ్లొచ్చు. హెయిర్ డ్రయ్యర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ హోటల్​ కు పరిమితం. 
  •  బెడ్​ షీట్లు, వాల్ క్లాక్స్ ఇవి తీసుకెళ్లకూడదు. అలానే పెయింటింగ్స్, లైట్స్​, బల్స్, కర్టెన్స్, రిమోట్స్, ప్రింటెడ్​ బుక్స్.. వీటిలో ఏ ఒక్కదాన్నీ తీసుకెళ్లడానికి వీల్లేదు..
  •  టూత్ బ్రష్లు, ఇయరడ్స్, షుగర్ ప్యాకెట్, నోట్ పేపర్స్. పెన్స్.. వంటివి తీసుకోవచ్చు.