యజమాని కండ్లు గప్పి.. రూ.30లక్షలతో పరారీ

యజమాని కండ్లు గప్పి.. రూ.30లక్షలతో  పరారీ
  • వర్కర్​తో పాటు మరో వ్యక్తి అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: యజమాని కండ్లు గప్పి డబ్బుల బ్యాగుతో ఉడాయించిన వర్కర్​తో పాటు మరో వ్యక్తిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు  చేశారు. మహారాష్ట్రకు చెందిన రోహన్ ​కదమ్​(20), ముజమ్మిల్ ​బాలిగర్​(21), పృథ్వీరాజ్, ప్రసాద్​ ఫ్రెండ్స్ . వీరంతా వారం కింద సికింద్రాబాద్​లోని ఓ హాస్టల్​లో దిగి చోరీలకు స్కెచ్ వేశారు. ప్లాన్​లో భాగంగా సికింద్రాబాద్ ​పాట్​ మార్కెట్​లో జితేంద్ర కుమార్​కు చెందిన బంగారం శుద్ధి దుకాణంలో రోహన్ పనికి కుదిరాడు. గురువారం సాయంత్రం తన షాపులో శుద్ధి చేసిన 400 గ్రాముల బంగారంతో పాటు రోహన్​ను తీసుకొని మోండా మార్కెట్​లో ఉన్న ఎస్ఎం జువెలరీకి జితేంద్ర వెళ్లాడు

. షాపు యజమానికి గోల్డ్​ఇచ్చి రూ.30 లక్షల నగదుతో నడుచుకుంటూ తిరిగి వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రోహన్​ నగదు బ్యాగుతో ఉడాయించాడు. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి మారుతీ స్విఫ్ట్ కారులో బెంగళూరుకు వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా బెంగళూరులో రోహన్, బాలిగర్​ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.29.90 లక్షలు, కారు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పృథ్వీ రాజ్, ప్రసాద్ ​కోసం గాలిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్​పోలీసులు తెలిపారు.